పట్టుబడిన పెండింగ్ చలాన్ల కారు.. ఒక్కసారిగా రూ. 54,773.83 కట్టిన వైనం!

  • హిమాయత్ నగర్ లో నో పార్కింగ్ జోన్ లో కారు
  • అప్పటికే కారుపై 45 పెండింగ్ చలాన్లు
  • అప్పటికప్పుడు రూ. 54,773 జరిమానా కట్టిన యజమాని
అది ఓ ఇన్నోవా కారు. నిన్న సాయంత్రం హైదరాబాద్, హిమాయత్ నగర్ 6వ వీధిలో ఉన్న నో పార్కింగ్ జోన్ లో నిలిపివుంది. ఈ కారును చూసిన ఆ ప్రాంత ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణంరాజు, జరిమానా విధించేందుకు సిద్ధమయ్యారు. తన వద్ద ఉన్న పీడీయే మిషన్ లో కారు నంబర్ ను ఎంటర్ చేసి అవాక్కయ్యాడా ఎస్ఐ.

ఎందుకంటే, అప్పటికే ఆ కారుపై 45 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. రూ. 54,773.83 జరిమానాగా విధించినట్టు, దాన్ని వాహన యజమాని చెల్లించలేదని తెలుసుకుని, కారును సీజ్ చేసేందుకు సిద్ధంకాగా, కారు తనదేనంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బాలాజీ వచ్చాడు. అప్పటికప్పుడు తన డెబిట్ కార్డు నుంచి ఆ మొత్తాన్ని చెల్లించాడు. నో పార్కింగ్ జోన్ లో వాహనాన్ని ఉంచినందుకు తాజా జరిమానానూ కట్టేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Go Back to Shorts
Hyderabad
Police
No Parking
Fine

More Telugu News